అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్ కుంగింది – మంత్రి ఉత్తమ్

-

అక్టోబర్ 21న మెడిగడ్డ పిల్లర్ కుంగిందని…కానీ కాళేశ్వరం పై ఒక్కసారి కూడా కేసీఆర్‌ మాట్లాడలేదని ఆగ్రహించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇది చాలా సిగ్గుపడాల్సిన సంఘటన…అన్ని విషయాలు నిర్దారణ చేస్తామని ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి…. హైదరాబాద్‌ నుంచి బయలుదేరారు.

మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి కాసేపట్లో ఆయన మేడిగడ్డకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడారు. అక్టోబర్‌ 21వ తేదీన ప్రాజెక్టు కుంగితే ప్రభుత్వం మారే వరకు ఘటనపై గత ప్రభుత్వం ఒక్కసారైనా స్పందించకపోవటం బాధాకరమని ఉత్తమ్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పరిణామాలపై కేసీఆర్‌ ఒక్క మాటైనా మాట్లాడలేదని చెప్పారు. లక్షకోట్ల రూపాయలతో కట్టిన దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు మూడేళ్లలోనే కుంగిపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. తక్కువ డ్యామేజీ జరిగి ఉండాలనే తాము కూడా కోరుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news