ఓటీటీలోకి హన్సిక లేటెస్ట్ మూవీ ‘మై నేమ్ ఈజ్ శృతి’.. . స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

-

యాపిల్ బ్యూటీ హ‌న్సిక మోత్వాని వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఈ భామ తమిళంలో వరుసగా చిత్రాలు చేస్తోంది. ఈ ఏడాది దాదాపు మూడు నాలుగు సినిమాలతో సందడి చేసిందీ భామ. ఈ బ్యూటీ మూసధోరణిలో పోకుండా డిఫరెంట్ కంటెంట్ ఉన్న చిత్రాలను ఎంచుకుంటోంది. అందులో భాగంగానే ఇటీవల మై3 అనే మూవీని చేసింది. ఇక లేటెస్ట్గా మై నేమ్ ఈజ్ శృతి అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది.

స్కిన్ మాఫియా కథతో రూపొందించిన ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో యాపిల్ బ్యూటీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. శ్రీ‌నివాస్ ఓంకార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ముర‌ళీ శ‌ర్మ, పూజా రామ‌చంద్ర‌న్‌, ప్రేమ‌, రాజీవ్ క‌న‌కాల కీలక పాత్రల్లో నటించారు.

Read more RELATED
Recommended to you

Latest news