రేపు మేడిగడ్డకు రావాలని బీఆర్‌ఎస్‌, బీజేపీలకు ఉత్తమ్‌ లేఖ

-

మేడిగడ్డపై కాంగ్రెస్‌ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. రేపు మేడిగడ్డకు రావాలని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీలకు కాంగ్రెస్‌ సర్కార్‌ లేఖ రాసింది. రేపు మేడిగడ్డ సందర్శనకు రావల్సిందిగా బీఆర్ఎస్, బిజెపి,ఏంఐఎం, సీపీఐ పార్టీ అధ్యక్ష్యులకు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు.

uttams-letter-to-brs-and-bjp-to-come-to-madigadda-tomorrow

కాగా ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్‌ కీలక ప్రకటన చేశారు. కేసీఆర్ మేడిగడ్డకు రావాలి.. కావాలంటే డేట్ మారుస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఏడాది అంతా అబద్దం చెప్పడం ఎందుకు అని.. మొదటి రోజే నిజం చెబుతున్నాం. ఈనెల 13న మేడిగడ్డకు వెళ్లాలని నిర్ణయించాం. ప్రతిపక్ష నేత కేసీఆర్.. బీఆర్ఎస్ నాయకులు ఈనెల 13న రావాలని ఆహ్వానిస్తున్నాం. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ ని తీసుకెళ్లుతున్నాం.. బీఆర్ఎస్ నేతలు కూడా రావాలన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version