వనస్థలిపురం సాప్ట్ వేర్ యువతిపై అత్యాచారానికి పాల్పడిన మరో వ్యక్తి అరెస్ట్

-

సాఫ్ట్ వేర్ ఇంజినీర్ యువతి పై చిన్ననాటి స్నేహితుడు  అత్యాచారం చేశాడు. ఉద్యోగం వచ్చిందని ఓ యువతి తన స్నేహితుడికి పార్టీ ఇవ్వగా, అదే అదునుగా భావించి మరో వ్యక్తితో కలిసి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మరిల్లు  హోటల్ లో యువతిపై ఇద్దరు యుకులు అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.

నగరంలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఓ యువతి.. తనకు ఇటీవలే ఉద్యోగం వచ్చిందన్న విషయాన్ని తన చిన్న నాటి స్నేహితుడు గౌతమ్ రెడ్డితో తెలిపింది. అతడు పార్టీ ఇవ్వాలని కోరడంతో  ఇద్దరూ కలిసి సాగర్ రింగ్ రోడ్డు వద్ద ఉన్న బొమ్మరిల్లు హోటల్‌కు వెళ్లారు. రెస్టారెంట్ లో ఇద్దరూ కలిసి పార్టీ చేసుకున్నారు. పార్టీలో ఇద్దరూ మద్యం తాగారు. అనంతరం ఆ హోటల్ కింద అంతస్తులోని రూములో వెళ్లారు. కాసేపటి తర్వాత యువతి మత్తు నుంచి తేరుకోగా.. తన గదిలో గౌతమ్ రెడ్డితో పాటు, మరో యువకుడు ఉండటం గమనించింది. గట్టిగా కేకలు వేసింది.దీంతో గౌతమ్ రెడ్డి, శివాజీ రెడ్డి పరారయ్యారు. నిన్న గౌతమ్ రెడ్డి అరెస్ట్ కాగా.. తాజాగా శివాజీ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. గౌతంరెడ్డి అత్యాచారం చేసిన అనంతరం శివాజిరెడ్డి ఆమెపై అఘాయిత్యం చేసినట్లు తేల్చారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news