రిమాండ్ రిపోర్టులో 3 నెలల కాల్ డేటా పెట్టి కుట్రలు చేస్తున్నారు అగ్రహించారు వేముల ప్రశాంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేసి గెలిచారని… రైతుబంధు,రైతు బోనస్ ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు వేముల ప్రశాంత్ రెడ్డి. ప్రశ్నిస్తే దాడులు చేసి అరెస్టులు చేస్తున్నారన్నారు. కొడంగల్ లో తన అల్లుడి ఫార్మా కంపెనీ కోసం భూములు సేకరిస్తున్నారని ఆరోపణలు చేశారు వేముల ప్రశాంత్ రెడ్డి.
12వ తేదీన సురేష్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్ చేయలేదన్నారు. 11వ తేదీన కేవలం ఒక్కసారి మాత్రమే సురేష్ నరేందర్ రెడ్డితో మాట్లాడారని తెలిపారు వేముల ప్రశాంత్ రెడ్డి. రిమాండ్ రిపోర్టులో మూడు నెలల కాల్ డేటా పెట్టి.. డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహించారు వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి అన్న రైతులను బెదిరిస్తే వారికి కోపం వచ్చిందన్నారు. కేటీఆర్ ను అరెస్టు చేయాలనే ఫోబియా రేవంత్ రెడ్డికి పట్టుకుందని చురకలు అంటించారు. కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడారని కుట్ర అంటున్నారు…. ఏదో ఒకటి చేసి బిఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి.