BRS నేతల కుట్రలు బయట పడుతున్నాయి : వేముల వీరేశం

-

కాంగ్రెస్ పార్టీ కి  మంచి పేరు వస్తుందని బీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని నకిరెకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. సీఎల్పీ సమావేశంలో వేముల వీరేశం, బాలు నాయక్ మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు చేసే కుట్రలో ఒక్కొక్కటి బయటపడుతున్నాయని తెలిపారు.  అభివృద్ధి పేరుతో ప్రభుత్వం పనులు చేస్తుంటే బిఆర్ఎస్ వాటిని అడ్డుకుంటుందన్నారు. ముఖ్యంగా  అధికారుల పై బీఆర్ఎస్ దాడులు చేయిస్తుంది. మల్లన్న సాగర్ కు బీఆర్ఎస్ నాయకులు ఎందుకు పోలేదని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజా పాలన చేపడుతున్నాం. సిరిసిల్ల, సిద్దిపేట, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాలను మీరు అభివృద్ధి చేసుకున్నారు.  రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ అభివృద్ధి కావడానికి మీకు  ఇష్టం లేదు కాబట్టి ఇలా చేస్తున్నారు. మేము ప్రజా పాలన చేపడుతున్నాం. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. 

Read more RELATED
Recommended to you

Latest news