ఢిల్లీ కి రాములమ్మ ? బీజేపీ లో చేరేందుకేనా ?

-

తెలంగాణలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాలు అన్ని పార్టీలకు ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలో వలసల భయం ఎక్కువగా కనిపిస్తోంది. ఎప్పుడైతే దుబ్బాక ఉప ఎన్నికలలో బిజెపి గెలిచిందో అప్పటి నుంచి కాంగ్రెస్ ,టిఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్తి వాదులు బిజెపి వైపు చూస్తుండడంతో ఆ పార్టీలలో ఆందోళన నెలకొంది. ఇప్పటి వరకు తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం మాత్రమే కనిపించేది. ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా, ఆ పార్టీదే విజయం అన్నట్లుగా పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా పరిస్థితులు తారుమారు కావడం,  టిఆర్ఎస్ కు ఎదురుగాలి బలంగా వీస్తుండడంతో, ప్రజావ్యతిరేకత పెరిగిపోతుండటం, అదే సమయంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పూర్తిగా బలహీనం కావడం, ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు బీజేపీకి వరంగా మారాయి.
బిజెపిలోని నాయకులంతా సమిష్టిగా పనిచేస్తూ బిజెపిని మరింతగా బలోపేతం చేసే విషయం పైన దృష్టి సారించారు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న విజయశాంతి దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనే బిజెపిలో చేరబోతున్నారు అంటూ హడావుడి జరిగింది.  దీనికి తగ్గట్టుగానే బీజేపీకి అనుకూలంగా విజయశాంతి వ్యాఖ్యలు చేయడం , తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ విజయశాంతి పై ప్రశంసలు కురిపించిన వ్యవహారాలతో ఆమె బిజెపిలో కి వెళ్లడం దాదాపు ఫిక్స్ అని అంతా అనుకున్నారు. ఆమె మాత్రం ఉప ఎన్నికల ఫలితాల తర్వాత బిజెపిలో చేరాలనే ఉద్దేశంలో ఉన్నట్టుగా ప్రచారం జరిగింది. అయితే ఇక ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి పై అందరికీ క్లారిటీ రావడం తో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, ఉపయోగం ఉండదనే ఉద్దేశంతో బిజెపిలో చేరేందుకు డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
ఈనెల 14వ తేదీన ఢిల్లీకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. అక్కడే బిజెపి పెద్దలను కలిసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొదట్లో బిజెపి నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో, బీజేపీ అగ్ర నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండడం, ఆమె పార్టీలో చేరగానే ఏదో ఒక కీలక పదవి ఇచ్చేందుకు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపిస్తుండడం, వంటి పరిణామాలు  తనకు కలిసొస్తాయని రాములమ్మ అభిప్రాయపడుతున్నారట. అందుకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా, బిజెపి జెండా కప్పుకునేందుకు ఆమె సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక ఆమె బిజెపిలో చేరడం కాయం కాబోతున్న నేపథ్యంలో, మరికొందరు కాంగ్రెస్ కు చెందిన వారు ఆమె బాటలో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది.
-Surya

Read more RELATED
Recommended to you

Exit mobile version