కొత్త పెన్షన్లు పంపిణీ సంగతి ఏది దొరా ? : కేసీఆర్‌ పై విజయశాంతి ఫైర్‌

-

కొత్త పెన్షన్లు పంపిణీ సంగతి ఏది దొరా అని కేసీఆర్‌ పై విజయశాంతి ఫైర్‌ అయ్యారు. కొత్త పింఛన్​‌దారులు మరో నెలరోజులు ఎదురు చూడక తప్పేలా లేదు. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించినా అవి సెప్టెంబర్‌లోనే ఖాతాల్లో పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆగ్రహించారు. ప్రస్తుతానికి ఊరికి ముగ్గురు, నలుగురు చొప్పున మండలానికి 48 మందిని ఎంపిక చేసి… వారికి మాత్రమే ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. కార్డులొచ్చినా అకౌంట్లలో డబ్బులు జమకాలేదు. కార్డుల పంపిణీ ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించ‌డంతో ఈ నెలాఖరు దాకా పంపిణీతోనే సరిపెట్టి… సెప్టెంబర్ చివరలో పింఛన్లు జమచేసే అవకాశాలు కనిపిస్తున్నాయని మండిపడ్డారు.


2018 సెప్టెంబర్ తర్వాత బైఎలక్షన్స్ జరిగిన హుజురాబాద్, నాగార్జునసాగర్‌లో మినహా సర్కారు కొత్తగా ఒక్క పెన్షన్ కూడా మంజూరు చేయలేదు. రాష్ట్రంలో గత నాలుగేండ్లలో 3.30 లక్షల కొత్త పింఛన్ అప్లికేషన్లను అప్రూవ్ చేసినా పెన్షన్ మాత్రం ఇవ్వలేదు. వీరిలో 57 ఏళ్లు నిండినోళ్లు మాత్రమే కాకుండా…. 65 ఏళ్లు నిండిన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేత, గీత కార్మికులు, ఒంటరి మహిళలు, పైలేరియా, ఎయిడ్స్ బాధితులు కూడా ఉన్నరు. ఎంపీడీఓల లాగిన్‌లో అప్రూవల్ అయి ఉన్న 3.30 లక్షల మంది జాబితాను ఇప్పుడు మరోసారి వెరిఫై చేస్తున్నారన్నారు.

ఇందులో ఎవరైనా చనిపోయినవాళ్లుంటే జాబితా నుంచి తొలగిస్తున్నరు. ఇవి కాకుండా… 57 ఏండ్లు నిండినోళ్లందరికీ ఆసరా పింఛన్ల కోసం నిరుడు ఆగస్టు, అక్టోబర్​లో రెండుసార్లు ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది. దాదాపు 10లక్షల దరఖాస్తులొచ్చాయి. కానీ అప్లికేషన్లు తీసుకుని ఏడాదైనా…. సర్కారు ఇప్పటిదాకా వాటిని వెరిఫై కూడా చేయలేదు. ఆ అప్లికేషన్లు ఇంకా తమ లాగిన్‌లోకి రాలేదని ఎంపీడీఓలు చెప్తున్నరు. అప్లై చేసుకున్నవారిలో అర్హులు ఎవరు, అనర్హులు ఎవరో తేల్చకుండా… అందరికీ పింఛన్లు ఇవ్వడం కుదరదని, జాబితా వచ్చాక డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేస్తే తప్ప అర్హులెవరో గుర్తించలేమని ఎంపీడీఓలు చెబుతున్నారు. పింఛన్ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, మంజూరు, ఖాతాల్లో జమ చెయ్యడం…. ఇలా ప్రతి దశలోనూ తీవ్ర జాప్యం చేస్తూ కేసీఆర్ సర్కారు ఏళ్ళకేళ్లు గడిపేస్తోంది. ఈ పరిస్థితి పింఛన్ ఆశావహుల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. సర్కారు ఉదాశీనవైఖరిని తిట్టుకుంటూ శాపనార్ధాలు పెడుతున్నరు. ప్రజల ఆక్రోశం ఈ సర్కారుని ముంచెత్తక తప్పదని హెచ్చరించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Exit mobile version