వచ్చేవి అసెంబ్లీ ఎన్నికలు కాదు..సార్వత్రిక స్వతంత్ర పోరాటమే అంటూ బీజేపీ నేత విజయశాంతి పేర్కొన్నారు. ఇది తెగింపుల సంగ్రామం, తెలంగాణ ఉద్యమకారుల తిరుగుబాటుతో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల మరో సార్వత్రిక స్వతంత్ర పోరాటం. తెలంగాణ బిడ్డలు ఇప్పటికే భార రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బరువు దించుకోనీకి సన్నద్ధమైయ్యారన్నారు.
ఆ ఫలితాలే దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్, టీచర్స్ ఎమ్మెల్సీ, హుజూరాబాద్ ఇంకా, దగ్గర దగ్గరగా మునుగోడు, నాగార్జునసాగర్ మొదలైనవి అని పేర్కొన్నారు. అయితే భార రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని ఓడగొట్టగలిగిన అభ్యర్ధిని గెలిపించి, లేదా గెలుపు వరకు తెచ్చిన విజ్ఞులైన తెలంగాణ ఓటర్లు, తమ ఓటు చీలకుండా, మూడో పార్టీ ప్రధాన పోటీలో లేనప్పుడు జాతీయ పార్టీ ఐనప్పటికి, డిపాజిట్ రాని స్ధాయికి కూడా ఆ పార్టీలను పరిమితం చేశారని వెల్లడించారు.
అదే తెలంగాణ జన శ్రేణుల విచక్షణ అని వివరించారు. ఇక, ఈ అంశమై భార రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)ని గద్దె దింపాలనుకుంటున్న ప్రతిపక్ష పార్టీలు… ఆ ప్రజా విశ్వాసాన్ని తమవైపు తిప్పుకుని ప్రజాస్వామ్య పోరాటానికి మరింత పెద్ద ఎత్తున అన్ని విధాలుగా యుద్ధసన్నద్ధలవుతారని తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్నదని ప్రజల నుంచి అందుతున్న సమాచారంగా నాతోటి తెలంగాణ ఉద్యమకారులు తెలుసుకుంటున్నట్లు అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నారు.