ప్రజల బతుకులు మారాలంటే… బీజేపీ అధికారంలోకి రావాలి – విజయశాంతి

-

స్వంత రాష్ట్రం వచ్చినా బతుకులు మారలేదని కేసీఆర్‌ సర్కార్‌ పై విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వంత రాష్ట్రం వచ్చినప్పటికీ తెలంగాణ ప్రజల బతుకుల్లో మార్పేమీ లేదు. రాష్ట్రం రాకముందు ఎలాంటి పరిస్థితి ఉండేదో… ఇప్పుడు కూడా అలానే ఉంది. నీళ్లు, నిధులు, నియామకాలే నినాదంగా సబ్బండ వర్గాల ప్రజలు స్వరాష్ట్ర సాధన కోసం నాడు రోడ్డెక్కి కొట్లాడారన్నారు. తెలంగాణ ఏర్పడిన ఈ ఎనిమిదేండ్లలో నిధులు, నియామకాల మాట అటుంచితే… చాలా ప్రాంతాల్లో నీళ్ల గోస ఇంకా అట్లనే ఉన్నది. పాలమూరు వలసలు కొనసాగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.


భూమి ఉన్నా పండించుకోలేని దీనస్థితిలో ఎంతో మంది అన్నదాతలున్నారు. ఉన్న ఊరిని, కన్నవారిని వదిలి… పొట్టకూటి కోసం దేశం నలుమూలలకు పాలమూరు వాసుల వలస బాట ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే పరిస్థితి మారుతుందనే భావన ఉండేది. కానీ, ప్రాజెక్టుల నిర్మాణంలోను, వాటిని పూర్తి చేయడంలోను ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన అలసత్వం, నిర్లక్ష్యం ఇప్పుడూ సాగుతున్నయి. దీంతో చేసేది లేక ఇప్పటికీ చాలామంది పిల్లల చదువులు, పొట్ట కూటి కోసం ముంబై తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నరు. పాలమూరు జిల్లాలో 42 లక్షల మంది జనాభా ఉంటే… ఇందులో 15 లక్షల మంది వలసపోవడం చూస్తే ఈ కేసీఆర్ సర్కార్ రాష్ట్రాన్ని ఏమాత్రం అభివృద్ధి చేసిందో దీన్ని బట్టే తెలుస్తోంది. పాలమూరు ప్రజల బతుకులు మారాలంటే… బీజేపీ అధికారంలోకి రావాలి. అప్పుడే వీళ్ళ జీవితాల్లోకి వెలుగులు వస్తయి. త్వరలోనే అది నిజం కానుందన్నారు విజయశాంతి.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news