అసెంబ్లీ ఎన్నికల్లో తాను రెండు చోట్ల పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు తెలంగాణ సిఎం కేసిఆర్. గజ్వేల్ తో పాటు..కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు గులాబీ బాస్. అయితే ఇలా రెండు చోట్ల కేసిఆర్ ఎందుకు బరిలో దిగుతున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. కేసిఆర్ ఎక్కడ పోటీ చేసిన గెలుస్తారు..కాబట్టి గజ్వేల్ ఒకటి సరిపోతుంది.
కానీ ఆయన రెండు చోట్ల ఎందుకు బరిలో దిగాలని అనుకున్నారో సరైన క్లారిటీ లేదు. ఈ తరుణంలోనే..కామారెడ్డి నుంచి BJP నేత విజయశాంతి పోటీకి రెడీగా ఉన్నట్టు సమాచారం. కామారెడ్డి నుంచే కేసీఆర్ పోటీ చేస్తుండగా… అక్కడ పోటీకి ఆమె సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో మెదక్ MPగా గెలిచిన విజయశాంతి… ఈసారి కూడా లోక్ సభకు పోటీ చేయాలనుకున్నారు. కానీ KCRను ఓడించే లక్ష్యంతో కామారెడ్డి నుంచి బరిలో దిగాలని విజయశాంతి భావిస్తున్నారని చెబుతున్నారు. అదే నిజమైతే బిజెపి అధిష్టానం ఓకే చెప్తుందో లేదో వేచి చూడాలి.