BREAKING : వరంగల్‌ వరదల నేపథ్యంలో రూ. 250 కోట్లు విడుదల

-

వరంగల్‌ వరుదల నేపథ్యంలోనే.. 250 కోట్లు తక్షణ సాయం కింద కేసీఆర్‌ సర్కార్‌ విడుదల చేసిందని ప్రకటించారు చీప్ విప్ వినయ్ భాస్కర్. హనుమకొండ జిల్లా కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు చీప్ విప్ వినయ్ భాస్కర్.ఈ సందర్భంగా చీప్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ..ఇటీవల వరంగల్‌ నగరంలో కురిసిన భారీ వర్షాలకి గ్రేటర్ పరిధిలో 1000 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు.

తక్షణ మరమ్మత్తుల కోసం మంత్ర కేటీఆర్ 250 కోట్లను విడుదల చేశారని.. గత ప్రభుత్వాల హయాంలోనే నాలాల ఆక్రమణలకు గురయ్యాయని చెప్పారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని…టికెట్ ఎవరికీ ఇచ్చినా పార్టీ సైనికులుగా కార్యకర్తగా పనిచేస్తామని ప్రకటించారు. వరదలు వచ్చినప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేయడం దుర్మార్గం అని.. భద్రకాళి బండ్ పైన కొంత మేర కోతకు గురైతే ప్రజలను భయబ్రాంతులకు కొందరు గురి చేయడం జరిగిందని వెల్లడించారు. ప్రతి పక్షాలు అసత్య ప్రచారాలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news