HYD: రాత్రంతా రోడ్ల మీద తిప్పి..యువతిపై గ్యాంగ్ రేప్ !

-

హైదరాబాద్‌ మహా నగరంలో దారుణం చోటు చేసుకుంది. రాత్రంతా రోడ్ల మీద తిప్పి గ్యాంగ్‌ రేప్‌ చేశారు. ఈ సంఘటన ఆదివారం రోజున జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌ నగరంలోని అల్వాల్‌లో దారుణం జరిగింది. శుక్రవారం రాత్రి ఓ మహిళ తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఆటోలో ఇంటికి బయల్దేరింది.

Violence against a woman coming from the police station to complain

డ్రైవర్ ఆమెను వీధుల్లో తిప్పుతూ మరో ఇద్దరు వ్యక్తులను ఎక్కించుకున్నాడు. ఆమెను బలవంతంగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఓ కారులోకి ఎక్కించి అత్యాచారానికి పాల్పడ్డారు. తెల్లవారుజామున 2:45కు బాధితురాలు తప్పించుకొని రోడ్డు మీద కేకలు వేయడంతో స్థానికులు కాపాడారు. అంతేకాదు..ఎవరికైనా చెబితే చంపేస్తామని ఆ యువతిని బెదిరింపులకు పాల్పడ్డారట. నిందితుల చెర నుండి తప్పించుకొని పోలీసులను ఆశ్రయించారు బాధితురాలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version