వీఐపీలు కూడా మేడారానికి ఆర్టీసీ బస్సులోనే రావాలి : మంత్రి సీతక్క

-

గతంలో జరగనంత వైభవంగా మేడారం జాతర నిర్వహిస్తామని మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ ఆమె మేడారం జాతరపై మీడియా సమావేశంలో మాట్లాడారు. 15 రోజుల ముందు నుంచే మేడారం జాతర వద్ద సందడి మొదలైందన్నారు. రెండు నెలల ముందు నుంచే ములుగు జిల్లా అధికారులు మేడారం జాతర పనులను పర్యవేక్సిస్తున్నారని చెప్పారు. భక్తులు క్రమ శిక్షణతో గుడికి రావాలని, వీఐపీ పాస్ ల విషయంలో అధికారులపై బాగా ఒత్తిడి వస్తుందని తెలిపారు.

ఎందుకు అంటే గతంలో రెండు వేలకు పైగా బస్సులు ఉండేవని.. ఈసారి 6వేల వరకు బస్సులు పెరిగాయి అన్నారు. వీఐపీ వాహనాలు, ఆర్టీసీ బస్సులు ఒకే రూట్ లో రావడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని తెలిపారు. మేడారం గుడికి దగ్గరగా ఆర్టీసీ బస్సు రూట్ ఉందని.. ఇబ్బంది లేకుండా మేడారం గుడికి రావచ్చన్నారు. వీఐపీలు వచ్చినా కూడా తాడ్వాయి, ఏటూరు నాగారం లేదా ములుగు వద్దనో వాహనాలు పక్కన పెట్టి అక్కడి నుంచి మేడారం వరకు బస్సులో రావాలని సూచించారు. ఆర్టీసీ బస్సు రూట్ ఈజీగా ఉందని, కాబట్టి అందరూ కూడా సహకరించాలని కోరారు.

 

Read more RELATED
Recommended to you

Latest news