నవంబర్ 1వ తేదీన కాంగ్రెస్ లో చేరనున్న వివేక్ వెంకటస్వామి !

-

కాంగ్రెస్ లో చేరాలని వివేక్ వెంకటస్వామి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. నవంబర్ 1, 2 తేదీలలో రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారం జరుగనుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరనున్నారట వివేక్ వెంకటస్వామి. ఇక చెన్నూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ కి వివేక్ వెంకటస్వామి సిద్ధం అయ్యారట.

Vivek Venkataswamy will join the Congress on November 1
Vivek Venkataswamy will join the Congress on November 1

కాంగ్రెస్ లో చేరాలని వివేక్ వెంకటస్వామి నిర్ణయం తీసుకోవడంతో…చెన్నూర్ అసెంబ్లీ టికెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ సిద్ధం అయిందని సమాచారం. దీంతో చెన్నూర్ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్ధిగా వివేక్ వెంకటస్వామి పేరు ఖరారు అయినట్లేనని అందరూ భావిస్తున్నారు. వాస్తవానికి చెన్నూర్ స్థానాన్ని పొత్తులో భాగంగా సిపిఐకి ఇవ్వాలని ప్రతిపాదన వచ్చింది. వివేక్ వెంకటస్వామి కోసం చెన్నూర్ స్థానాన్ని సిపిఐ కు ఇవ్వరాదని తాజాగా నిర్ణయం తీసుకుందట కాంగ్రెస్‌. అధికార బిఆర్ఎస్ ను ఓడించగల సత్తా, సామర్ధ్యం బిజేపికి లేదనే భావనతో వివేక్ వెంకటస్వామి…కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారట.

Read more RELATED
Recommended to you

Latest news