రైలు ప్రమాద ఘటనపై రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి

-

విజయనగరం రైలు ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఏడు బృందాలు రెస్క్యూలో నిమగ్నమయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటికే 14 మంది మరణించగా.. అందులో 11 మంది వివరాలు లభ్యమయ్యాయి. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా పలువురు రాజకీయ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. అదే విధంగా మృతులకు, గాయపడిన వారికి పరిహారం ప్రకటించారు. మరోవైపు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ రైల్వే శాఖ తరఫున పరిహారం ప్రకటించారు.

తాజాగా విజయనగరం రైలు ప్రమాద ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు. ఇందులో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఈ ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యల్లో తమ వంతు సహాయ సహకారాలు అందించాలని రాహుల్‌ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మృతుల కుటుంబాలకు అండగా ఉండాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news