వివేకా హత్య కేసు.. ఎంపీ అవినాష్ రెడ్డికి బీటెక్ రవి సవాల్..!

-

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి  వైసీపీకి టీడీపీ నేత బీటెక్ రవి సంచలన సవాల్ విసిరారు. వైఎస్ వివేకా హత్యలో తన ప్రమేయం లేదని.. నార్కో అనాలసిస్ పరీక్షకైనా నేను సిద్ధం. వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ఆయన ప్రమేయం లేదని నార్కో అనాలసిస్ పరీక్షకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. వివేకానందారెడ్డి హత్య జరిగిన రోజే ఆయనను గొడ్డలితో చంపినట్లు ఎలా తెలిసిందో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో సీఎం జగన్ హస్తం ఉందనే విషయం త్వరలోనే బయటకు వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు.

వివేకా హత్యను వీడియో తీసి వైసీపీ పెద్దలకు పెట్టినట్లు తనకు సమాచారం ఉందని బీటెక్ రవి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రత్యక్ష రాజకీయాల్లోకి వైఎస్ వివేకానంద కుమార్తె సునీతరెడ్డి వస్తున్నారని సీఎం జగన్కు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. పులివెందులలో అభద్రత ఉన్నందునే టీడీపీ నేత సతీష్ రెడ్డిని వైసీపీలో చేర్చుకున్నారని ఎద్దేవా చేశారు. సునీతా రెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారనే వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news