ఓటు వేయాలంటే.. వీటిల్లో ఏదైనా ఒకటి తప్పనిసరి ఉండాలి

-

మరికొద్ది రోజుల్లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 30వ తేదీన తెలంగాణలో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ఓటరు జాబితాను విడుదల చేసింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. మరోవైపు చిన్న పొరపాటుతో ఓటు వేసే అవకాశాన్ని చేజార్చుకోవద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌రాస్‌ చెప్పారు.

ఓటు వేసేందుకు వెళ్లేటప్పుడు అవసరమైన గుర్తింపు కార్డులు ఉన్నాయో లేవో ఓసారి చూసుకోవాలని రోనాల్డ్ రాస్ సూచించారు. ఎన్నికల సిబ్బంది అందించే ఓటరు చిట్టీతో పాటు ఓటరు గుర్తింపుకార్డు వెంట తీసుకెళ్లాలని చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించిన 12 రకాల గుర్తింపుకార్డుల్లో ఏదో ఒకటి తీసుకెళ్లొచ్చని తెలిపారు. అయితే  గుర్తింపు కార్డులో ఫొటో, పేరు, ఓటరు జాబితాతో సరిపోలి ఉండాలన్నారు.

ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించిన 12 రకాల గుర్తింపు కార్డులు ఇవే.. 

1.ఆధార్‌కార్డు, 2.మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, 3.కార్మిక శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్‌కార్డు, 4.ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌కార్డు, 5.ఫించను మంజూరు పత్రం, 6.పాన్‌కార్డు,  7.డ్రైవింగ్‌ లైసెన్సు, 8.ఫొటో ఉన్న ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల, లిమిటెడ్‌ కంపీనల ఉద్యోగి గుర్తింపుకార్డు, 9.ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు జారీ చేసే గుర్తింపుకార్డు, 10.భారతీయ పాస్‌పోర్టు, 11.ఫొటో ఉన్న పోస్టాఫీసు, బ్యాంకు పాసు పుస్తకం, 12.దివ్యాంగుల గుర్తింపు కార్డు.

Read more RELATED
Recommended to you

Latest news