ఇవాళ అర్ధరాత్రి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ గ్రహణాన్ని కొన్ని రాశుల వారు చూడకూడదని.. అయితే మరికొన్ని రాశుల వారికి మాత్రం ఈ గ్రహణం వల్ల శుభ ఫలితాలు ఉంటాయని ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇంతకీ ఈ గ్రహణం చూడకూడని వారెవరో ఓసారి తెలుసుకుందామా..?
మేష రాశి, కర్కాటక, సింహరాశుల వారు, అశ్వినీ నక్షత్రంలో జన్మించిన వారు ఇవాళ ఏర్పడనున్న పాక్షిక చంద్రగ్రహణం చూడకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. పూజలు, వ్రతాలు, నోములు నోచుకునే వారంతా శనివారం మధ్యాహ్నం 3.30 గంటల లోపుగా చేయాలని సూచించారు. ఈ మూడు రాశులు, అశ్విని నక్షత్రం వారికి మినహాయిస్తే మిగతా తొమ్మిది రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుతాయని తెలిపారు.
మరోవైపు చంద్రగ్రహణం దృష్ట్యా దేశవ్యాప్తంగా ప్రముఖ ాలయాలన్నీ ఇవాళ్టి నుంచి రేపు ఉదయం వరకు మూసివేయనున్నారు. అయితే పూరీ శ్రీక్షేత్రంలో జగన్నాథ సన్నిధి మాత్రం రాత్రంతా తెరిచే ఉంటుంది. గ్రహణం వీడిన తర్వాత ముగ్గురు మూర్తులకు మహా స్నానం, ఆలయ సంప్రోక్షణ చేసి మంగళహారతి, అబకాశ, మైలం, తిలకధారణ సేవలు జరిపిన తర్వాత భక్తులకు దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తారు.