ఎన్నికల సంఘం తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల ఓటర్ల సంఖ్యను వెల్లడిచింది. ఈ లెక్క ప్రకారం ఏపీలో ఎక్కువ జనాభా ఉన్నారు కాబట్టి.. ఓటర్ల సంఖ్య పెరిగింది. ఒక సారి ఆ లెక్కలు గమనిస్తే, ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య 3,99,84,868 కు చేరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమావేశం సవరణ-2023 చేపట్టిన ఎన్నికల సంఘం గురువారం తుది జాబితాను ప్రచురించింది.
ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో ఒకటి 1,30,728 మంది ఓటర్లు పెరిగారు.ఇక తెలంగాణలో ఓటర్లు 2,99,92,941 ‘రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 2,99,92,941 కు చేరింది. గత ఏడాదితో పోలిస్తే 3,63,953 మంది ఓటర్లు తగ్గారు. 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న ఓటర్లు 2,78,650 మంది నమోదు చేసుకున్నారు’ అని కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ గురువారం వెల్లడించారు.