సుప్రీం కోర్ట్ లో తెలంగాణకు కీలక విజయం.. మణికొండ జాగీర్ భూములపై గెలుపు

-

సుప్రీం కోర్ట్ లో తెలంగాణ ప్రభుత్వానికి కీలక విజయం సాధించింది. వివాదంలో ఉన్న మడికొండ జాగీర్ భూములను తెలంగాణ ప్రభుత్వానికే చెందుతాయని అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. ఇది తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో ముఖ్యమైన కేసుగా ఉంది. వేలకోట్లు విలువ చేసే 1654 ఎకరాల భూమి ప్రస్తుతం ప్రభుత్వ పరంగా కానుంది. ఈ భూములపూ తెలంగాణ ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డ్ కు మధ్య వివాదం జరుగుతోంది. ఒక వేళ రాష్ట్ర ప్రభుత్వం కేసు ఓడిపోతే పెద్ద మొత్తంలో డబ్బలు చెల్లించాల్సి వచ్చేది.

తాజాగా మొత్తం భూములపై సర్వ హక్కలు తెలంగాణ ప్రభుత్వానివే అని సుప్రీం కోెర్ట్ తీర్పు చెప్పింది. ఈ తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి  పెద్ద ఊరట లభించినట్లు అయింది. గతంలో 1654 ఎకరాల 30 గుంటలు తమవే అని మడికొండ దర్గా కోర్టుకెక్కింది. న్యాయమూర్తులు జస్టిస్ సుబ్రమణియన్, హేమంత్ గుప్తాలు ఈ తీర్పును వెల్లడించారు. 2016 నుంచి ప్రభుత్వానికి, వక్ఫ్ బోర్డ్ కు మధ్య ఈ భూముల వివాదం నడుస్తోంది. గతంలో హైకోర్ట్ లో న్యాయం దక్కలేదని.. సుప్రీం కోర్ట్ ను ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్ట్ తీర్పు వెల్లడించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version