BREAKING : మంత్రి కేటీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ.. మంత్రులపై చర్యలు తీసుకోండి

-

తెలంగాణ మునిసిపల్ ఐ.టి శాఖ మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాసారు. గ్రేటర్ హైదరాబాద్ లో టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా రేవంత్ రెడ్డి డిమాండ్ చేసారు. టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ భూములు, చెరువులు కజ్బా చేసి అక్రమ కట్టడాలు కడుతున్నారని.. టిఆర్ఎస్ నాయకుల అక్రమాలపై మీరు పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు.

అక్రమార్కులపై ఉక్కు పాదం అంటూ అప్పుడప్పుడు అధికారుల హంగామా తప్ప చర్యలు లేవన్నారు. టిఆర్ఎస్ నాయకులు చేస్తున్న అక్రమాలను మీరు ఎందుకు అడ్డుకోవడం లేదు. మీకు చేతకాకనా.. లేక అందులో మీకు వాటాలు ఉన్నాయా.. ? అని నిలదీశారు.

జవహర్ నగర్ లో 488 సర్వే నెంబర్ లో మంత్రి మల్లారెడ్డి బంధువులు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా చేసి అక్కడ ఆసుపత్రి కూడా నిర్మించి మరో మంత్రి చేత ప్రారంభం చేశారు.. ఇది అంత ఆషామాషీ విషయమా ? అని ప్రశ్నించారు. ఫీర్జాది గూడ లో మీ నాయకులు ప్రభుత్వ స్థలం ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్మించారని.. మీరు చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పక్షాన మేమే ప్రత్యేక్ష కార్యాచరణ కు దిగుతామని.. రేవంత్ రెడ్డి హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version