వరంగల్ మోడల్ బస్ స్టేషన్‌కు భూమి పూజ

-

ఎట్టకేలకు వరంగల్ బస్టాండుకు మోక్షం కలిగింది. నేడు వరంగల్ జిల్లా పర్యటనలో 1456 కోట్లతో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, భూమి పూజలు చేయనున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్.

ఈ సందర్భంగా కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో దక్షిణకొరియాకు చెందిన యంగ్ వన్ కంపెనీ 840 కోట్ల పెట్టుబడితో 22 వేల మందికి ఉపాధి కల్పించనున్న వస్త్రపరిశ్రమకు భూమి పూజ చేయనున్నారు మంత్రి కేటీఆర్‌. అలాగే, వరంగల్ కలెక్టరేట్‌కు శంకుస్థాపన, మోడల్ బస్ స్టేషన్‌కు భూమి పూజ చేయనున్నారు కేటీఆర్‌.

దేశాయిపేటలో జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పంపిణీ, వర్కింగ్ ఉమెన్ హాస్టల్‌కు శంకుస్థాపన‌ కూడా చేయనున్నారు. కాగా, వరంగల్‌లో దేశంలోనే పెద్దదైన టెక్స్‌టైల్ పార్క్… కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ బాగా రూపు దిద్దుకుంటోందని మంత్రి అన్నారు. 900 కోట్ల పెట్టుబడితో కొరియాకు చెందిన యంగ్ వన్ కంపెనీకి శంకుస్థాపన చేయనున్నట్లు మంత్రి  తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version