రానున్న 6 నెలల్లో కొడాలి నానికి దబిడే..దిబిడే – బుద్దా వెంకన్న

-

కొడాలి నానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు టిడిపి ఉత్తరాంధ్ర ఇంఛార్జ్ బుద్దా వెంకన్న. కొడాలి నాని గడ్డి, అన్నం కాకుండా గుట్కాలు తింటాడని… గుడివాడలో భూముల కొనుగోలులో పెద్ద కుంభకోణం చేసాడని ఆరోపణలు చేశారు.

మరో ఆరు నెలల్లో కొడాలి నానికి దబిడే.. దిబిడే అంటూ హెచ్చరించారు. టిడిపి ప్రభుత్వం వచ్చాక కొడాలి నానిని బొక్కలో వేయడం గ్యారెంటీ అని… ఓడిపోయినా పవన్, లోకేష్ ప్రజల మధ్య ఉన్నారన్నారు. నల్లబెలూన్లు వదిలిమ మహిళలను అరెస్టు చేసి మహిళా పక్షపాతి అంటే ఎలా అని నిలదీశారు.

2005లో రాజశేఖరరెడ్డి కొడాలి నానికి ఉపయోగపడితే.. 2009లో చంద్రబాబు ను టికెట్ ఎందుకు అడిగావని.. ప్రశ్నించారు. నిజం మాట్లాడితే తల పగులుతుందనే శాపం ఉందేమో కొడాలి నానికి అంటూ వ్యాఖ్యానించారు. కొడాలి నాని నిన్న సభలో చెప్పినవన్నీ అబద్ధాలని… కొడాలి నాని బ్రతుకే లాలూచీ బ్రతుకు అంటూ ఫైర్‌ అయ్యారు. రాజశేఖరరెడ్డి వేసిన శిలాఫలకాన్ని పగులకొట్టావని ఎందుకు చెప్పలేదన్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version