తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో నీటి సమస్య అలాగే సాగునీటి సమస్య విపరీతంగా పెరిగిపోయింది. కాలేశ్వరం ప్రాజెక్టును వాడకపోవడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీటి కరువు ఏర్పడింది. దీంతో సమైక్య పాలనలో ఎలాగైతే నీటి కోసం పోరాటం జరిగిందో అలాగే… అలాంటి దృశ్యాలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ట్యాంకర్లు, బోరింగులు వాడుతున్నారు జనాలు.
మిషన్ భగీరథ నల్ల అసలు సరిగా రావడం లేదు. అయితే ఈ నీటి సమస్య ప్రస్తుతం తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును కూడా తాకింది. కెసిఆర్ ప్రస్తుతం ఉంటున్న ఇంటికి నీటి సమస్య ఏర్పడింది. దీంతో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలో నీటి సమస్య తీర్చేందుకు ట్యాంకర్లు వచ్చాయి. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ దగ్గర ఉండి ట్యాంకర్లను తెప్పించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.