ప్రభుత్వ రంగ సంస్థలను నిలబెట్టాలనే నిబద్దత మాది : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

-

ప్రభుత్వ రంగ సంస్థలను నిలబెట్టాలనే నిబద్దత మాది అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తాజాగా హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ సింగరేణిని కాపాడుకుందాం. సింగరేణిని విస్తరించాలని అధికారులను ఆదేశిస్తున్నాం. ఈ ఆదాయం వాళ్లదే.. వాళ్ల కోసం ఏం చేయడానికైనా సిద్దమే అని తెలిపారు.  మేము అధికారంలోకి వచ్చే నాటికి ఆర్టీసీ దివాళా తీసింది. మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీని బతికించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు భట్టి విక్రమార్క.

బీఆర్ఎస్ నేతలు చేసినట్టు మేము చేయదలుచుకోలేదు. ఆసుపత్రిల కోసం సింగరేణి కార్మికులు సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడే ఆసుపత్రులను ఏర్పాటు చేస్తామని.. అలాగే ఎడ్యూకేషన్ రంగాన్ని తీసుకొద్దామని తెలిపారు. ప్రతీ శాసనసభ నియోజకవర్గంలో ఇంటర్ నేషనల్ స్టాండర్స్ లో స్కూల్స్, ఆసుపత్రులు ఏర్పాటు చేద్దామన్నారు. కార్మికుల వేల్పేర్ గురించి ఎక్కడ కూడా కాంప్రమైజ్ కావద్దని సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news