సీఎం రేవంత్ రెడ్డి పై వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేస్తున్నాం : సీఈవో వికాస్ రాజ్

-

2019 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఓటింగ్ పర్సంటేజ్ బాగానే ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ పర్సంటేజ్ ఇప్పటికే 50 శాతం దాటిందని తెలిపారు. సోమవారం ఎన్నికల సరళిని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్నారు. హైదరాబాద్లో 20 శాతం పోలింగ్ నమోదైందని వెల్లడించారు. పోలింగ్ బూత్లలో అభ్యర్థులు ఓటర్ స్లిప్లను పరిశీలించడం కోడ్ ఉల్లంఘనే అని అన్నారు.

సీఎం రేవంత్ రెడ్డిపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని తెలిపారు. కాగా, తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని 17 పార్లమంట్ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సీటు ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రారంభం కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ పర్సంటేజ్ 40.38 శాతం నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. గత ఎన్నికల కంటే ఈ సారి రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version