మత్స్యకారుల జీవితాలలో వెలుగులు నింపేందుకు ఎన్డీఏ ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మత్స్యకారుల సేవలో పేరుతో మత్స్యకార భరోసా పథకానికి శ్రీకారం చుట్టారు. ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు వేట విరాట సమయానికి సంబంధించి భృతి కింద ఒక్కో కుటుంబానికి ఇచ్చే మొత్తాన్ని రూ.10వేల నుంచి రూ.20వేల వరకు పెంచిన సంగతి తెలిసిందే. మొత్తం రూ.259 కోట్లు మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాల్లో జమ చేశారు.
ఈ సందర్భంగా ఎచ్చర్ల నియోకవర్గం బుడగట్లపాలెంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హైదరాబాద్ వెళ్లినా.. ఢిల్లీ వెళ్లినా శ్రీకాకుళం కాలనీ ఉంటుంది. ఆర్మీలో ఎక్కువ పని చేసిన వారు ఇక్కడి వారే. 26 జిల్లాలలో తక్కువ తలసరి ఆదాయం శ్రీకాకుళం జిల్లాదే. ఈ జిల్లాలో తెలివితేటలు, నాయకత్వానికి కొదవలేదు. స్తానికుల సమస్యలు, పేదల కష్టాలను చూశాను. ప్రభుత్వం బాధ్యతగా ఉండాలి. ప్రజల ఆదాయం పెంచాలని.. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలి. వెనుకబడిన వర్గాల కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడుతామని తెలిపారు.