సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్ పై ప్రజాశాంతిపార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంద కోట్లతో రేవంత్ రెడ్డి భారత్ సమ్మిట్ నిర్మిస్తున్నారని తెలిసి షాక్ అయ్యానని చెప్పారు. 200 కంట్రీల నుండి ప్రెసిడెంట్లను, ప్రైమిస్టర్లను ఆహ్వారించారని అన్నారు. కానీ ఒక్క ప్రెసిడెంట్ ఒక్క ప్రైమ్ మినిస్టర్, ఒక్క గ్లోబల్ సెలబ్రెటీ రాలేదన్నారు. 3వేల మంది బిలియనీర్లు ఎవ్వరూ రాలేదని విమర్శించారు. పేరుకు భారత్ అని కానీ ఒక్క భరతుడు కూడా రాలేదని సెటైర్లు వేశారు.
శాంతి కావాలి అన్నా, పెట్టుబడులు రావాలన్నా పాల్ అన్న రావాలి. పాలన మారాలన్నారు. ఇది భారత్ సమ్మిట్ కాదని కాంగ్రెస్ సమ్మిట్ అని విమర్శలు కురిపించారు. తెలంగా రాష్ట్రాన్ని, దేశాన్ని సర్వనాశనం చేసే సమ్మిట్ ఇది అంటూ ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి తన నుండి ప్రపోజల్ తీసుకున్నారని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఉందని మండిపడ్డారు. తాను గ్లోబల్ పీస్ సమ్మిట్ పెడతానంటే ఒప్పుకున్నారని అందరినీ తీసుకువద్దామని అన్నారని చెప్పారు. కానీ ఇప్పుడు ఒక్కరూ రాలేదన్నారు. కొలంబియా నుండి ఎప్పుడో ఓ మాజీ మంత్రి వచ్చారని అన్నారు.