ఆంధ్రా, తెలంగాణ అంటూ జరిగే కుట్రలను భగ్నం చేస్తాం : దానం నాగేందర్

-

ఆంధ్రా, తెలంగాణ  అంటూ జరిగే కుట్రలను భగ్నం చేస్తామని ఎమ్మెల్యే  దానం నాగేందర్ పేర్కొన్నారు. ఇవాళ ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడారు. జీహీచ్ఎంసీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ కు తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అరికె పూడి గాంధీ పై విమర్శలు హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి ప్రజలే తగిన బుద్ది చెబుతారని పేర్కొన్నారు.

ఇక ఇప్పటికైనా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలపై ఆలోచించాలని హితవు పలికారు. హైదరాబాద్ నగరంలోని చెరువుల్లో కబ్జాకు గురైన భూములను రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను తీసుకొచ్చినట్టు తెలిపారు దానం నాగేందర్. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ప్రజల సంక్షేమం కోసమే సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను తీసుకొచ్చారని గుర్తు చేశారు. అన్యాక్రాంతమైన ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version