వరదల వల్ల అమరావతికి ఎలాంటి ఇబ్బంది లేదని మంత్రి నారాయణ క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. వరదల గురించి అమరావతి పై వస్తున్నటువంటి అనవసర ప్రచారాన్ని నమ్మవద్దు అని సూచించారు. బుడమేరు వల్ల ఎలాంటి ఇబ్బందులు లేవు. కొండవీటి వాగు వల్ల కూడా ఇబ్బంది లేదు. అమరావతి చాలా సురక్షితంగా ఉంది. భవిష్యత్ కృష్ణా నదికి 15 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షితంగా ఉండే ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.
కొండవీటి వాగు పాల వాగులపై త్వరలో టెండర్లు పిలిచి పనులు చేస్తామని.. బుడమేరు వరద ఉదృతికి ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. రాజధాని ప్రాంతం మునిగిపోయిందని వైసీపీ అసత్య ప్రచారాలు చేసింది. రాజధాని పరిసర ప్రాంతాలకి ఎలాంటి ముప్పు లేదు. రాజధాని నిర్మాణానికి ఇలాంటి ఇబ్బందులు తలేత్తకుండా మూడు వాగులని స్టోరేజ్ కెపాసిటీ పెంచుతున్నాం. అందులో భాగంగా కొండవీటి వాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్స్ ని డిజైన్ చేస్తున్నామని తెలిపారు.