రాజీవ్ గాంధీపై మాట్లాడే అర్హత KTR కి లేదు – మంత్రి కోమటిరెడ్డి

-

రాజీవ్ గాంధీ పై మాట్లాడే అర్హత కేటీఆర్ కి లేదని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సోమవారం నల్గొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. సెక్రటేరియట్ ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే తప్పేముందని ప్రశ్నించారు.

దేశానికి ప్రధానిగా సేవలు అందించిన ఆ మహా నాయకుడు నేటికీ జనం గుండెల్లో చిరస్థాయిగా నిడిచాడని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తి పట్ల అనుచితంగా మాట్లాడితే సహించేది లేదని మండిపడ్డారు. గత పదేళ్లలో బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

రాబోయే పదేళ్లు అధికారం మాదేనని ధీమా వ్యక్తం చేశారు కోమటిరెడ్డి. వాళ్లు ఒకటి అంటే తాము రెండు అంటామని అన్నారు. పరుష భాష నేర్పింది కేసీఆర్ ఏనని.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరో బిఆర్ఎస్ నేతలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్ హరీష్ రావులను తాము లెక్కలోకి తీసుకోవడం లేదని అన్నారు కోమటిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version