ఎవ్వరినీ వదిలిపెట్టం.. లెక్కలతో సహా అందరి చిట్టా బయటపెడతాం : భట్టి

-

గొప్పలకు పోయి కథ టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేక చేతులెత్తేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. మంగళవారం సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లో పర్యటించారు అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పదేళ్లు కాలయాపన చేసి బీఆర్ఎస్ ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చింది అన్నారు. పుట్టబోయే బిడ్డపై కూడా అప్పు చేసి పెట్టిందని ఎద్దేవా చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక రెండు నెలలు అయినా గడపకముందే కాంగ్రెస్ ప్రభుత్వం పై అక్కస్ వెళ్ళగకుతున్నారని మండిపడ్డారు.ఎవ్వరిని వదిలి వదిలిపెట్టబోమని లెక్కలతో సహా అందరి చిట్టా బయట పెడతామన్నారు. ఓడిపోయిన అసహనంలో కేటీఆర్ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని సీరియస్ అయ్యారు. అంత గొప్పగా పాలిస్తే ప్రజలు ఎందుకు ఓడిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని దోచుకోవడాన్ని చూసే మిమ్మల్ని ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని చెప్పారు. రాష్ట్ర సంపదను ప్రజలకు పంచుతామని ఆత్మగౌరవం స్వేచ్ఛ స్వాతంత్రంతో బతకడానికి కావాల్సిన వాతావరణం కల్పిస్తామన్నారు. డ్రగ్స్ ఫ్రీ నగరంగా హైదరాబాదును మార్చడమే ఇందిరమ్మ రాజ్యం లక్ష్యం అన్నారు. రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ పరిపాలన అందిస్తామని.. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి సంక్షేమమే తప్ప డ్రగ్స్ ఉండగానే భరోసా హైదరాబాదు ప్రజలకు కల్పించాలన్నారు. మతాల పేరిట విభజన చేసి ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విగాథం కలిగించే వారి పట్ల ఉపేక్షించమన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version