సమర్థంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం : కేటీఆర్

-

బీఆర్ఎస్ కి ఈ ఓటమి ఓ స్పీడ్ బ్రేకర్ మాత్రమే.. కేడర్ కుంగి పోవద్దు.. బాధపడొద్దు అని సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రకారమే సీఎం కేసీఆర్ రాజీనామా చేశారు. రాజకీయాల్లో స్థిత ప్రజ్ఞత చాలా అవసరం అన్నారు. ఓటమి పై రివ్యూ చేసుకుందాం. ఎన్నికల్లో ఆశించిన ఫలితం రాలేదని.. అయినా రాష్ట్రంలో సమర్థంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని తెలిపారు. మా ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటాం. ఎదురుదెబ్బను గుణపాఠంగా తీసుకుంటాం. మాకు ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా నిలదొక్కుకున్నాం. బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవ్వరూ నిరాశ చెందవద్దు. ఎక్కడ కోల్పోయామో అక్కడే తెచ్చుకుంటాం.

గోడకు కొట్టిన బంతిలా మళ్లీ పుంజుకుంటాం. మేము ఆశించిన ఫలితాలు దక్కలేదు.. అయినప్పటికీ ప్రతిపక్ష పాత్రలో కూడా ఇమిడి పోతాం. కొత్త ప్రభుత్వాన్ని వెంటనే ఇబ్బంది పెట్టము.. వాళ్లు కూడా కుదుర్కోవాలని తెలిపారు మంత్రి కేటీఆర్. మొత్తానికి ఈ ఫలితాలు మాకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగించాయి. కొత్త పాత్రలో కూడా ప్రజలకు సేవ చేస్తాం అన్నారు. కాంగ్రెస్ మంచి ప్రభుత్వాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ కి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version