భారత రాజ్యాంగం ప్రమాదంలో కొట్టుమిట్టాడుతోంది.. డిప్యూటీ సీఎం భట్టి సంచలన వ్యాఖ్యలు

-

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం వల్ల భారత రాజ్యాంగం ప్రమాదంలో కొట్టుమిట్టాడుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ గాంధీభవన్ లో  ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్నే మార్చేందుకు బీజేపీకి కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రిజర్వేషన్లను ఎత్తివేయకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ లు కాంగ్రెస్కు సపోర్ట్ చేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని.. ఇప్పటికైనా కేసీఆర్ ఆ ముసుగు నుంచి బయటకు రావలన్నారు.

 

ఒక వేళ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. వెంటనే కులగణన చేపట్టి దామాషా ప్రకారంగా రిజర్వేషన్లు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యంగం ప్రమాదంలో ఉందని, ప్రజలు ఇప్పటికైనా మేల్కొని కాంగ్రెస్ ను బలపరచాలని విజ్ఞప్తి చేశారు. నరేంద్ర మోడీ మరోసారి ప్రధాని అయితే.. రిజర్వేషన్లను పక్కగా ఎత్తి వేస్తారని తెలిపారు. రాబోయే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 14 కైవసం చేసుకోవడం ఖాయమని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version