తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తులకు కేసీఆర్ సర్కార్ తీపికబురు చెప్పింది. వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తులకు 1లక్ష రూపాయల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాయం మొదలు అయింది. ఈ మేరకు అప్లికేషన్ వెబ్సైట్ని లాంచ్ చేశారు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్. https://tsobmmsbc.cgg.gov.in వెబ్సైట్లో అప్లికేషన్లు స్వీకరణ జరుగనుంది.
దీని కోసం ఫోటో, ఆధార్, కులదృవీకరణ పత్రం సహా 38 కాలమ్ లతో సరళమైన అప్లికేషన్ రూపొందించారు. ఇక అర్హులైన వారు తక్షణమే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. కుల వృత్తి, చేతివృత్తులకు సంబందించిన పనిముట్లు, మరియు ముడిసరకు కొనుగోలుకు ఈ ఆర్థిక సాయం అందించనుంది కేసీఆర్ సర్కార్.