అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్ర ఎక్సైజ్ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం మండల పరిధిలోని సంగినేనిపల్లి, గోపాల్ దీన్నే, రంగవరం, గోవర్ధనగిరి గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. సంగినేనిపల్లిలో ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా 20 లక్షల రూపాయలతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి, రూ.ఐదు లక్షలతో జిల్లా పరిషత్ పాఠశాల కాంపౌండ్ నిర్మాణానికి, గోపాల్ దిన్నె గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ, 20 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశారు. రంగవరం గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ, రూ.80 లక్షల లతో రంగవరం – నాగసానిపల్లె బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ, గోవర్ధనగిరి లోరూ. 90 లక్షల లతో గోవర్ధనగిరి – రంగవరం బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు.
సింగిల్ విండో మాజీ చైర్మన్ బాల్ రెడ్డి మాట్లాడుతూ 357 సర్వేనెంబర్ భూ సమస్యను పరిష్కరించాలని అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు, పింఛన్లు, ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, ఇప్పటికీ కొంత మంది రైతులకు రుణమాఫీ,రైతు భరోసా డబ్బులు రాలేదని మంత్రి జూపల్లి దృష్టికి తెచ్చారు.