కాంట్రాక్టు లెక్చరర్ల రెగ్యులరైజ్ ఏమైంది : రేవంత్ రెడ్డి

-

తెలంగాణలో కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల వేతనాలు వెంటనే చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో కాంట్రాక్టు ఉద్యోగులు, జూనియర్ లెక్చరర్లు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం రాగానే ఒక్క సంతకంతో అందరినీ రెగ్యులర్ చేస్తా అని ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు.

2014లో టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చినట్టు చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. క్రమబద్దీకరణ జరుగకపోగా జీతాలు ఇవ్వండని అర్థించాల్సిన పరిస్థితి వచ్చిందని అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ కి  రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నా సకాలంలో జీతాలు లేక వందలాది మంది అవస్థలు పడుతున్నారు. నెలల తరబడి జీతాలు రాక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారింది. ఈఎంఐలు సకాలంలో కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో బాధాకరమన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తరువాత అసలు ఏ రోజు జీతం పడుతుందో కూడా తెలియని దుస్థితి నెలకొంది. ధనిక రాష్ట్రం అని చెప్పుకోవడమే తప్ప కాంట్రాక్టు లెక్చరర్స్ కి వేతనాలు చెల్లించలేని దుస్థితి మీ ప్రభుత్వంలో వచ్చింది. సకాలంలో వారికి జీతాలు వచ్చేవిధంగా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news