మేం పాదయాత్ర చేస్తే కెసిఆర్ కు వచ్చిన నష్టం ఏంటి? – వైఎస్ షర్మిల

-

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల పాదయాత్రకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఇటీవల వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్ తరలించిన తర్వాత రాజకీయంగా పెద్ద చర్చ మొదలైంది.

పాదయాత్రలకు అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని ఆమె ప్రశ్నించింది. కాగా పాదయాత్ర కోసం మరోసారి షర్మిల పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా పాదయాత్రకి అనుమతి తిరస్కరించారు పోలీసులు. షర్మిల పాదయాత్ర వల్ల లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని పోలీసులు తెలిపారు. అయితే పోలీసులు పాదయాత్రకి అనుమతి నిరాకరించడంతో ఆమె హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి.. అక్కడే నిరసన దీక్ష చేపట్టారు. దీక్షలో కూర్చున్న షర్మిలను పోలీసులు అరెస్టు చేశారు.

అక్కడి నుంచి పోలీసు వాహనంలో ఆమెను బలవంతంగా తరలించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. కెసిఆర్ మరోసారి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. మా పార్టీ వల్ల కేసీఆర్ పాలనకు ప్రమాదం అని తెలిసి పాదయాత్రను ఆపడానికి కుట్ర పన్నారని.. దాడి చేసిన వారిని వదిలేసి మమ్మల్ని అరెస్టు చేశారని మండిపడ్డారు. మేము పాదయాత్ర చేస్తే కెసిఆర్ కు వచ్చిన నష్టం ఏంటి? వైయస్సార్ తెలంగాణ పార్టీ అంటే కెసిఆర్ కు భయం లేకపోతే ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version