శ్రీశైలం ఎవరి అయ్య జాగీరు అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్ర నాయకులను నిలదీశారు. జడ్చర్ల బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. తాను మహబూబ్ నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాను. కొంత మంది జూరాల నుంచే నీళ్లు తీసుకోవాలంటున్నారు. కృష్ణా నది పక్కనే ఉన్నా మనకు ఏం లాభం జరుగలేదు అన్నారు సీఎం కేసీఆర్. అప్పట్లో మనుషులే కాదు.. అడవులు కూడా బక్కబడ్డాయి. తొమ్మిదేళ్ల పోరాటం తరువాత అనుమతులు వస్తున్నాయి. రాబోయే మూడు, నాలుగు నెలల్లో లక్షా 50వేల ఎకరాల్లో సాగునీరు అందుతుందని తెలిపారు సీఎం కేసీఆర్.
పాలమూరి ఎత్తిపోత పథకాన్ని జూరాల నుంచి శ్రీశైలంకి మార్చామని తెలిపారు కేసీఆర్. మహబూబ్ నగర్ నీటి గోసపై నేను ఉద్యమ సమయంలో ఓ పాట రాశాను. ఇప్పుడు కూడా కొందరూ ఐటీ హబ్ గా జడ్చర్లను తీర్చిదిద్దే బాధ్యత నాది అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నాం. పాలమూరు ఎత్తిపోతల 90 శాతం పూర్తి అయింది. తెలంగాణను ఉత్తిగా ఇవ్వలేదు.. విద్యార్థులను బలి తీసుకొని ఇచ్చారని గుర్తు చేశారు సీఎం కేసీఆర్.