బండి సంజయ్‌కి సీఎం రేవంత్‌ కుర్చీని కాపాడాలనే తాపత్రయం ఎందుకో : కేటీఆర్‌

-

కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ తీరును ప్రశ్నిస్తూ బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. బండి సంజయ్‌కి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవిని కాపాడాలనే తాపత్రయం దేనికో అని ఆయన తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమా.. లేకపోతే బీజేపీ అనుబంధ ప్రభుత్వమా..? అనే సందేహం వ్యక్తంచేశారు.

బీజేపీ కేంద్ర మంత్రి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సంజయ్  రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ కాపాడడానికి పడే తాపత్రయం ఏందో ?? ఇది కాంగ్రెస్ ప్రభుత్వమా లేక బీజేపీ అనుబంధ ప్రభుత్వమా  “Ajab Prem Ki Ghajab Kahani” అని కేటీఆర్‌ పోస్టు చేశారు. దీనికి రేవంత్‌రెడ్డి సీఎం పదవి నుంచి దించేందుకు మంత్రులు కుట్ర పన్నుతున్నారని బండి సంజయ్‌ వ్యాఖ్యానించిన వార్తకు సంబంధించిన క్లిప్పింగ్‌ ను కూడా  జతచేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version