మూసీ బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఇవాళ నాగోల్ మూసీ పరివాహక ప్రాంతంలో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ బాధితుల తరుపున న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. హైదరాబాద్ కి వరమైన మూసీని మురికి కుంపంగా మార్చింది కాంగ్రెస్సే అన్నారు. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఎస్టీపీ ప్లాన్ చేశాం. బీఆర్ఎస్ హయాంలోనే ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు అయిందని తెలిపారు. మూసీ గురించి 2014లో మేనిఫెస్టో లో పెట్టాం. మూసీని తప్పకుండా పూర్వవైభవం తీసుకొచ్చాం. ఎస్టీపీలతో 20 కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేశామని తెలిపారు.
కాంగ్రెస్ హయాంలో మూసీ మురికి కుంపంగా మారిందని తెలిపారు. హైదరాబాద్ మూసీ.. ఓ వరం అన్నారు. 3,866 కోట్ల రూపాయలతో అంబర్ పేట, నాగోల్, కూకట్ పల్లి, ఉప్పల్, మల్కాజ్ గిరి, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లిలో కలిపి ఎస్టీపీలను నిర్మించామని తెలిపారు.