ఏదో ఒక రోజు సీఎం అవుతా : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

-

నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడం కంటే ముందు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, కేటీఆర్ మోసాల వల్ల తెలంగాణ ప్రజలు మోసపోయారని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంత్ చారి మరణిస్తే.. అతని కుటుంబానికి ఏం న్యాయం చేశారని ప్రశ్నించారు. మా తెలంగాణ వస్తే.. మాకు నీళ్లు, నిధులు, ఉద్యోగాలు వస్తాయని ఎంతో మంది ప్రాణాలను అర్పించుకున్నారు. నల్లగొండ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా నా హయాంలోనే జరిగింది. ఏదో ఒక రోజు సీఎం అవుతానని.. కానీ నాకు సీఎం కావాలని లేదు.. మీ ఆదరణ చూస్తుంటే.. చర్మం వలించి చెప్పులు కుట్టించినా తక్కువే. మనం అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీ స్కీమ్ లు అమలు చేస్తామని తెలిపారు.

మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిందని.. ఏపీలో నష్టం జరుగుతుందని తెలిసినా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని తెలిపారు కోమటిరెడ్డి. ఉద్యోగాల ప్రభుత్వం విఫలం చెందిందని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు 15 తారీఖు వచ్చినా కానీ జీతాలు రావడం లేదు. కాంగ్రెస్ హయాంలో 1వతేదీనే జీతాలు అందజేశాం.. అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పారు. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదేళ్ల కాలం నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా జారీ చేయలేదని తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version