మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఆ మూడ్రోజులు వైన్ షాపులు బంద్

-

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలోని మందు బాబులకు అధికారులు షాక్ ఇచ్చారు. మూడ్రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులు మూసివేయనున్నట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వరుసగా ఆ మూడ్రోజులు రాష్ట్రంలో డ్రై డేగా పాటించాలని సూచించారు. ఇంతకీ ఆ మూడ్రోజులు ఎప్పుడంటే..?

తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్​ ఈనెల 30వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైన్ షాపులు మూసివేయాలని రాష్ట్ర అబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా ఈ మూడు రోజులు డ్రై డే పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మళ్లీ డిసెంబర్‌ 1వ తేదీన వైన్‌ షాపులు తెరచుకుంటాయని చెప్పింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ తెలిపింది. నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version