మందుబాబులకు బిగ్‌ షాక్‌… 3 రోజుల పాటు వైన్స్‌ షాపులు బంద్‌

-

తెలంగాణ మందుబాబులకు బిగ్‌ షాక్‌. మూడు రోజుల పాటు వైన్స్‌ షాపులు బంద్‌ కానున్నాయి. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలోని వైన్ షాపులు, బార్లు, కళ్ళు దుకాణాలు బందు కానున్నాయి.

Wines bandh for 3 days from today

ఈ రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఈ నెల 30న ఎన్నికలు ముగిసే వరకు తెలంగాణ రాష్ట్రంలోని వైన్ షాపులు, బార్లు, కళ్ళు దుకాణాలు మూసివేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా తెలంగాణ రాష్ట్రంలోని వైన్ షాపులు, బార్లు, కళ్ళు దుకాణాలు తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

అటు పలు కమిషనరేట్ల పరిధిలో ఈ రోజు సాయంత్రం 5 నుంచి 144 సెక్షన్ అమల్లోకి రానుంది. పోలింగ్‌కు 48 గంటల ముందే తెలంగాణ రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ అమల్లోకి వస్తుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. సమావేశాలు, ఇంటింటి ప్రచారం లాంటివి చేయవద్దని ఈసీ సూచనలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version