నేడు కామారెడ్డి, సిరిసిల్లలో కేటీఆర్​ రోడ్‌షో

-

తెలంగాణ శాసనసభ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ఇవాళ్టితో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. చివరి రోజైన నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ కూడా దూకుడు ప్రదర్శించడానికి రెడీ అవుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ గత కొంతకాలంగా సభలు, సమావేశాలు, రోడ్ షోలతో బిజీబిజీగా గడుపుతున్నారు.

జీహెచ్ఎంసీ పరిధితోపాటు వివిధ నియోజకవర్గాల సభలు, రోడ్ షోలలో పాల్గొన్న కేటీఆర్ ఇవాళ కామారెడ్డి, సిరిసిల్లలో రోడ్‌షోలలో పాల్గొంటారు. ఈ ఎన్నికల ప్రచారంలో చివరిసారిగా ప్రజలనుద్దేశించి మాట్లాడతారు. ఇప్పటి వరకు కేటీఆర్ తాను పాల్గొన్న సభలు, రోడ్ షోలల్లో అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తూనే కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓవైపు బీఆర్ఎస్ తొమ్మిదన్నరేళ్ల అభివృద్ధిని వివరిస్తూ మరో ఛాన్స్ ఇవ్వాలని కోరుతూ.. ఇంకోవైపు కాంగ్రెస్ వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తోందంటూ ప్రజలకు వివరిస్తూ వచ్చారు. ఒక్క కేసీఆర్ ను ఢీ కొట్టేందుకు ఇవాళ ఒక్క రోజే దిల్లీ నుంచి పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version