గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది. మంత్రి సీతక్క ఆదేశాలతో SERP వందశాతం బదిలీలకు అనుమతులు ఇస్తూ సోమవారం అధికారులు జీవో జారీ చేశారు. SERP లో మొత్తం 3974 మంది ఉద్యోగులు ఉన్నారు. గత పదేళ్లుగా బదిలీలు లేవని.. దయచేసి తమను చేయాలని ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు బదిలీలకు ప్రభుత్వ ఆమోదం తెలిపింది. చాలా మంది సిబ్బంది ఒకే చోట పాతుకుపోవడంతో పనుల్లో వేగం తగ్గిందని.. మళ్లీ పనుల్లో వేగం పెంచేందుకు బదిలీలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని మంత్రి సీతక్క చెప్పారు.
మహిళా సంఘాలను స్వయం ఉపాధి నుంచి ఉపాధి కల్పన, సంపద సృష్టి ప్రభుత్వం తీర్చిదిద్దుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ వేగవంతం కోసం బదిలీలు ఉపయోగపడతాయని భావిస్తున్న ప్రభుత్వం అభిప్రాయం వ్యక్తం చేసింది. SERP కేంద్ర కార్యాలయంలో ఎంతో మంది ప్రాజెక్టు మేనేజర్లు, జిల్లాల్లో డీపీఎం, ఏపీఎంలు, సీసీలుగా చాలా మంది ఒకే దగ్గర పాతుకుపోయారని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.