రైతులకు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలి : సీఎం రేవంత్ రెడ్డి

-

లగచర్ల రైతులకు సీఎం రేవంత్ రెడ్డి బే షరతుగా క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లగచర్ల అంశం పై జాతీయ మానవ హక్కుల కమిషన్ నివేదిక ఇచ్చింది. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని లగచర్లలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన పై జాతీయ మానవ హక్కుల కమిషన్ రిపోర్టు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. 

తాము చెప్పినట్టుగానే పోలీసులు, లగచర్ల గిరిజన రైతులు మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం, పోలీసులు ఉక్కుపాదం మోపారని NHRC రిపోర్టులో ఇచ్చారని తెలిపారు. అధికారంలో ఉన్నవారు చట్టానికి అతీతులమని భావించే ప్రతీ ఒక్కరికీ ఈ నివేదిక ఓ హెచ్చరికలా పని చేస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ అధికార దుర్వినియోగాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news