తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి బీఆర్ఎస్ పార్టీ పై విరుచుకుపడ్డారు. మంగళవారం గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని విమర్శించారు. ఆ పార్టీ తట్టా బుట్టా సర్దుకోవాల్సిందేనని ఎద్దేవా చేసారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇస్తోందని దుయ్యబట్టారు. బీజేపీకి సపోర్ట్ చేస్తూ రాష్ట్రంలో గులాబీ పార్టీ ఆత్మహత్యకు పాల్పడుతోందని పేర్కొన్నారు.
ఆ పార్టీ అధినేత ఫాం హౌస్ కే పరిమితం అయ్యారని.. ఇక ఆ పార్టీ కోలుకోలేదని తెలిసి.. కేసీఆర్ ఏమి చేయలేని స్థితిలోకి వెళ్లిపోయారని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నామరూపాల్లేకుండా పోతుందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.