కొత్త సంవత్సరం సమీపిస్తున్న సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం. రామకృష్ణారావు తెలిపారు.భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రధానాలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో తెలిపారు.
ప్రసాద కౌంటర్ల లలో లడ్డూలు, పులిహోర, అభిషేకం లడ్డూలను ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరంతరాయంగా విక్రయిస్తామని అన్నారు. ఇందుకోసం 50 వేల నుంచి 60 వేల వరకు లడ్డూలను తయారు చేయిస్తున్నామని తెలిపారు. ఆలయాల పరిసర ప్రాంతాలు ఎప్పటికప్పుడూ పరిశుభ్రత, మంచినీటి , భక్తుల రద్దీకి అనుగుణంగా కొండపైకి టీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సులను నడిచే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు . ప్రజలు ఎక్కువగా తరలి వచ్చే అవకాశం ఉండడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తును సైతం పెంచుతున్నామని పేర్కొన్నారు.